భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

11, నవంబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

సేవాలాల్ మహారాజ్ ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి

సేవాలాల్ మహారాజ్ ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి
సేవాలాల్ మహారాజ్ ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: జగదాంబ సద్గురు సేవాలాల్ మహారాజ్ ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని BRS రాష్ట్ర నాయకుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి ఆకాంక్షించారు. మెదక్ జిల్లా హవేలీఘనపూర్ మండలం రాజపేట తండా గ్రామంలోని శ్రీశ్రీశ్రీ జగదాంబ సద్గురు సేవాలాల్ మహారాజ్ దేవాలయ పంచమ వార్షికోత్సవ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఇతర BRS నాయకులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

సేవాలాల్ మహారాజ్ ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి

అనంతరం తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. సంత్ సేవాలాల్ మహారాజ్ చూపిన మార్గం సమాజానికి ఎంతో ఆదర్శప్రాయమని, ఆయన బోధనలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిస్తాయని అన్నారు. సమాజంలో ఐక్యత, సోదరభావం, సేవాభావం మరింత పెంపొందించుకోవాలని సూచించారు. సేవాలాల్ మహారాజ్ ఆశయాలను భావితరాలకు అందించడంతో పాటు, ఆయన బోధించిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు.

సేవాలాల్ మహారాజ్ ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి

సేవాలాల్ మహారాజ్ కృపాకటాక్షాలతో ప్రజల జీవితాల్లో సుఖశాంతులు వెల్లివిరియాలని, ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ పంచమ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తున్న కమిటీ సభ్యులకు, వేడుకల్లో పాల్గొన్న భక్తులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

సేవాలాల్ మహారాజ్ ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి

ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, గ్రామస్తులు తిరుపతిరెడ్డికి ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. ఈ వేడుకల్లో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కసిరెడ్డి మాణిక్యరెడ్డి, సుల్తాన్‌పూర్ సర్పంచ్ రమేష్ నాయక్, కొత్తపల్లి సర్పంచ్ సాయిలు, సర్ధన సర్పంచ్ వినోద్ సతీష్, మాజీ సర్పంచ్ సాయి గౌడ్, హవేలీఘనపూర్ మాజీ వైస్ ఎంపీపీ రాధాకిషన్ యాదవ్, నాయకులు సతీష్ రావు, రాజేశ్వరరావు, పోచయ్య, నరేందర్ రెడ్డి, కిరణ్ గౌడ్, కురుమ పోచయ్య, వాడి హనుమంత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బిక్షపతి రెడ్డి, మాజీ సర్పంచ్ రాములు, కుక్కల రాములు, కుక్కల శ్రీనివాస్, సర్పంచ్ కిషన్, గంగిలి నరసింహులు, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.