భారత్ సమాచార్, మెదక్ జిల్లా: జగదాంబ సద్గురు సేవాలాల్ మహారాజ్ ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని BRS రాష్ట్ర నాయకుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి ఆకాంక్షించారు. మెదక్ జిల్లా హవేలీఘనపూర్ మండలం రాజపేట తండా గ్రామంలోని శ్రీశ్రీశ్రీ జగదాంబ సద్గురు సేవాలాల్ మహారాజ్ దేవాలయ పంచమ వార్షికోత్సవ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఇతర BRS నాయకులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. సంత్ సేవాలాల్…






