భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

11, నవంబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

మూడు గ్రామాల్లో 15 మంది సభ్యులతో బాలల కమిటీలు

మూడు గ్రామాలలో విసిపిసి కమిటీలు..

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: గ్రామస్థాయిలో బాలల భద్రతను మరింత బలోపేతం చేసేందుకు నెల్లికుదురు మండలంలోని మూడు గ్రామాల్లో గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీలు (VCP C) ఏర్పాటు చేశారు. IC D S అంగన్వాడీ నెల్లికుదురు సెక్టార్ సూపర్వైజర్ ఎన్. సరిత ఆధ్వర్యంలో బుధవారం బ్రాహ్మణ కొత్తపల్లి, వస్రాం తండా, మదనతుర్తి గ్రామాల్లో కమిటీలను ఎన్నుకున్నారు.

బాలల భద్రతకు కమిటీలు కీలకం

మూడు గ్రామాలలో విసిపిసి కమిటీలు..

బ్రాహ్మణ కొత్తపల్లి UPSలో నిర్వహించిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ డా. చిర్ర యాకాంతం గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో బాలల భద్రత కోసం ఈ కమిటీలు నిరంతరం పనిచేస్తాయని తెలిపారు. బాలల అక్రమ రవాణా, బాల్య వివాహాలు వంటి సమస్యలు తలెత్తకుండా VCP C సభ్యులు నిఘా కొనసాగించాలని సూచించారు. బ్రాహ్మణ కొత్తపల్లి కమిటీ చైర్మన్‌గా సర్పంచ్ డా. యాకాంతం గౌడ్, కన్వీనర్‌గా అంగన్వాడీ టీచర్ జ్యోతిని ఎంపిక చేశారు. మొత్తం 15 మందితో కమిటీని ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఎర్ర రవి, రెవెన్యూ అధికారి సందీప్, సూపర్వైజర్ ఎన్. సరిత, HM వెంకటేష్, షేక్ అజీమ్, బొల్లు అశోక్, బొల్లు మురళీకృష్ణ యాదవ్, అంగన్వాడీ టీచర్లు మాదగాని కవిత, దాసరి కవితతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మూడు గ్రామాలలో విసిపిసి కమిటీలు..

వస్రాం తండా, మదనతుర్తిలోనూ కమిటీలు

వస్రాం తండా గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీ చైర్మన్‌గా స్థానిక సర్పంచ్ జి. కరుణ మధును ఎన్నుకున్నారు. ఆమెతో పాటు మరో 15 మందిని కమిటీ సభ్యులుగా నియమించారు. అలాగే మదనతుర్తి గ్రామ కమిటీ చైర్మన్‌గా సర్పంచ్ వడ్లకొండ రాధను ఎంపిక చేశారు. ఈ కమిటీలోనూ మరో 15 మందికి సభ్యులుగా బాధ్యతలు అప్పగించారు. గ్రామస్థాయిలో బాలల సమస్యలను గుర్తించడం, వారి హక్కులకు రక్షణ కల్పించడం, బాల్య వివాహాలు, అక్రమ రవాణా వంటి ఘటనలను అడ్డుకోవడంలో ఈ కమిటీలు కీలకంగా పనిచేయనున్నాయి.