భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

11, నవంబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

సర్పంచి కుమార్తెకు యాదవ రెడ్డి పరామర్శ

కాచికల్ సర్పంచి కుమార్తెకు యాదవ రెడ్డి పరామర్శ..

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలం కాచికల్ గ్రామ సర్పంచి ఇట్టె లీల, దేవేందర్ రెడ్డి దంపతుల కుమార్తెకు హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో కాలుకు శస్త్రచికిత్స జరిగింది. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎదళ్ల యాదవ రెడ్డి బుధవారం ఆసుపత్రికి వెళ్లి బాలికను పరామర్శించారు.

కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు ప్రభాకర్ గౌడ్‌తో కలిసి అపోలో ఆసుపత్రికి చేరుకున్న యాదవ రెడ్డి.. చికిత్స పొందుతున్న బాలికను కలిసి ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం సర్పంచి దంపతులతో మాట్లాడి బాలికకు అందుతున్న వైద్యం గురించి ఆరా తీశారు. ఆమె త్వరగా కోలుకుని ఆరోగ్యంగా ఇంటికి తిరిగి రావాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా సర్పంచి ఇట్టె లీల, దేవేందర్ రెడ్డి దంపతులు ఆసుపత్రిలో ఉన్నారు.