భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: కరీంనగర్లో నవంబర్ 18న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ నేతృత్వంలో నిర్వహించనున్న మహా పాదయాత్రను విజయవంతం చేసేందుకు బీజేపీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. ఈ కార్యక్రమానికి హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి 100 బస్సులతో పాటు ఇతర వాహనాల్లో భారీగా తరలివెళ్లాలని బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ పిలుపునిచ్చారు. పాదయాత్రకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
ఈ మేరకు బుధవారం హుస్నాబాద్ పట్టణంలోని తిరుమల గార్డెన్లో నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. నవంబర్ 18న చేపట్టనున్న పాదయాత్రకు సంబంధించిన ఏర్పాట్లు, జన సమీకరణ, ప్రచార కార్యక్రమాలపై చర్చించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమానికి పెద్దఎత్తున తరలివచ్చేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యం
ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియపై ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లో ఎండగట్టడంతో పాటు, ఓటర్ల జాబితా ప్రక్షాళనపై ఉన్న అపోహలను తొలగించడమే లక్ష్యంగా బీజేపీ దేశవ్యాప్తంగా మహా పాదయాత్రలు నిర్వహిస్తోందని బైరి శంకర్ ముదిరాజ్ తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, పారదర్శకమైన ఓటర్ల జాబితా అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు వివరించారు.
నవంబర్ 18న ఉదయం 10 గంటలకు కరీంనగర్లో జరిగే ఈ మహా పాదయాత్రకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా నిలిపేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తూ పాదయాత్ర విజయవంతానికి కృషి చేయాలని సూచించారు.
గ్రామస్థాయిలో విస్తృత ప్రచారం
హుస్నాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల అధ్యక్షులు, మండల ప్రభారీలు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర, జిల్లా నాయకులు, పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులతో పాదయాత్ర విజయవంతానికి చేపట్టాల్సిన కార్యాచరణపై సమావేశంలో చర్చించారు. గ్రామస్థాయిలో విస్తృతంగా ప్రచారం నిర్వహించి, అధిక సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు పాల్గొనేలా సమన్వయం చేసుకోవాలని బైరి శంకర్ ముదిరాజ్ దిశానిర్దేశం చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి 100 బస్సులతో పాటు ఇతర వాహనాల్లో వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లపై దృష్టి పెట్టాలని సూచించారు.
భారీగా హాజరైన నాయకులు
ఈ సమావేశంలో కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, ఖమ్మం వెంకటేశం, గుర్రాల లక్ష్మారెడ్డి, మాచర్ల కుమారస్వామి, పైడిపల్లి పృథ్విరాజ్, నునావత్ మోహన్ నాయక్, భుక్యా సంపత్ నాయక్, రామంచ మహేందర్ రెడ్డి, జాలిగం రమేష్, పోలోజు సంతోష్, దంచనాల శ్రీనివాస్, శ్రీరామోజు శ్రీనివాస్, మంతుర్తి శ్రీకాంత్, దొడ్డి శ్రీనివాస్, తోట స్వరూప, గొల్లపల్లి వీరాచారి, గుగులోత్ తిరుపతి నాయక్, తక్కళ్లపల్లి సంపత్ రావు, జనగామ వేణుగోపాల్ రావు, కర్ణకంటి నరేష్, పిల్లి నర్సయ్య, వెల్దండి రాజేంద్రప్రసాద్, బొల్లి శ్రీనివాస్, అచ్చ రవీందర్, పల్లెపాటి మధుకర్, మెడబోయిన స్వరూప, బొమ్మగాని సతీష్, కాతాం రాజశేఖర్ రెడ్డి, నాగు అజయ్, తోట సమ్మయ్య, అంబిర్ కవిత, కంది శంకర్, కసాని సతీష్, జిల్లా మల్లేశం, చిన్మయి, కండె శంకర్, తగురం లక్ష్మణ్, తడిసిన రత్నాకర్ రెడ్డి, చెరుకు సంపత్, మడక రవికుమార్, పేరుమాండ్ల భరద్వాజ్, మధుసూదన్ రెడ్డి, బుద్దార్తి మహేందర్, అల్లి కుమారస్వామి, చీదురాల వెంకటేష్, కంచర్ల శంకరయ్య, నమిండ్ల ప్రవీణ్, స్వరాన్, బత్తుల శ్రీనివాస్, భాషబాతిని మధుసూదన్, విలసాగరం మురళీమోహన్, రాయికుంట చందు, బొడిగ వెంకటేష్, భూ శంకరాచారి, ఇల్లందుల తిరుపతి, సిద్ధమల్ల రమేష్, బోయిని మహేష్, మారుపాక వివేక్, సందేవెన కుమార్, గుగులోత్ అర్జున్ నాయక్, బోనగిరి తిరుపతి ముదిరాజ్, రైనా నాయక్, ముక్కిస సమ్మిరెడ్డి, ఇరుగాడిండ్ల రాజకుమార్, కుంట స్వప్న రెడ్డి, గంగుల కుమార్, అశోక్ రెడ్డి, వొదిమల్ల కనుకయ్య, పోతురాజు సుధాకర్, చందుపట్ల రవీందర్ రెడ్డి, తడవేని కార్తీక్, గుర్రాల అశోక్ రెడ్డి, భాషావేని సంపత్ తదితరులు పాల్గొన్నారు.