భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: కరీంనగర్లో నవంబర్ 18న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ నేతృత్వంలో నిర్వహించనున్న మహా పాదయాత్రను విజయవంతం చేసేందుకు బీజేపీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. ఈ కార్యక్రమానికి హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి 100 బస్సులతో పాటు ఇతర వాహనాల్లో భారీగా తరలివెళ్లాలని బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ పిలుపునిచ్చారు. పాదయాత్రకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
ఈ మేరకు బుధవారం హుస్నాబాద్ పట్టణంలోని తిరుమల గార్డెన్లో నియోజకవర్గ స్థాయి…






