భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

12, నవంబర్ 2026, గురువారంభారత్ సమాచార్

ఆర్. వెంకటాపూర్‌లో గ్రామసభ.. నీటి పొదుపుపై అవగాహన

రామాయంపేట మండలం ఆర్ వెంకటాపూర్ లో గ్రామసభ

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రాబోయే రోజుల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలను దృష్టిలో పెట్టుకుని నీటి వినియోగంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఆర్. వెంకటాపూర్ గ్రామంలో గురువారం సర్పంచ్ వెంకుగారి ఉమారాణి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ శాఖలకు చెందిన అధికారులు హాజరై గ్రామ సమస్యలు, వ్యవసాయ పరిస్థితులు, నీటి వినియోగంపై చర్చించారు.

రామాయంపేట మండలం ఆర్ వెంకటాపూర్ లో గ్రామసభ

ఈ సందర్భంగా ఎంపీడీవో షాజీలుద్దీన్, మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్ కుమార్, విద్యుత్ AE తిరుపతిరెడ్డి, మండల పశువైద్యాధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు. వర్షాభావ పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నందున అందుబాటులో ఉన్న నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని రైతులకు సూచించారు.

రామాయంపేట మండలం ఆర్ వెంకటాపూర్ లో గ్రామసభ

వ్యవసాయంలో ఎక్కువ నీరు అవసరమయ్యే పంటలకు బదులుగా తక్కువ నీటితో సాగు చేసుకునే ఆరుతడి పంటలను ఎంచుకోవాలని అవగాహన కల్పించారు. నీటి లభ్యతను బట్టి పంటల సాగుపై నిర్ణయాలు తీసుకోవాలని, భవిష్యత్తులో నీటి కొరత సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

రామాయంపేట మండలం ఆర్ వెంకటాపూర్ లో గ్రామసభ

అలాగే గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గ్రామసభలో అధికారుల దృష్టికి తీసుకురావాలని, సంబంధిత శాఖల ద్వారా వాటి పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. ప్రజలు గ్రామసభలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

రామాయంపేట మండలం ఆర్ వెంకటాపూర్ లో గ్రామసభ

ఈ కార్యక్రమంలో వెంకుగారి సంజీవరెడ్డి, వార్డు సభ్యులు, గ్రామ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.