భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

12, నవంబర్ 2026, గురువారంభారత్ సమాచార్

రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మున్సిపల్ చైర్మన్ ప్రత్యేక పూజలు

కార్తీకమాసం సందర్భంగా రాదేరాదేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: కార్తీక మాసం సందర్భంగా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని NH-44 బైపాస్‌లో ఉన్న శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ గజవాడ లావణ్య నాగరాజు, వైస్ చైర్మన్ పోచమ్మల నవనీత గణేష్ శివమాలలు ధరించి ఆలయానికి చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు.

కార్తీకమాసం సందర్భంగా రాదేరాదేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

ఈ సందర్భంగా రానున్న రోజుల్లో ఎల్‌నినో ప్రభావంతో ప్రజలకు నీటి సమస్యలు తలెత్తకుండా చూడాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. అలాగే ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, ప్రతి కుటుంబానికి మంచి జరగాలని రాజరాజేశ్వర స్వామిని వేడుకున్నట్లు పేర్కొన్నారు.

కార్తీకమాసం సందర్భంగా రాదేరాదేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

కార్తీక మాసం కావడంతో ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పుట్టి సందీప్, స్వాములు నాగరాజు, డాక్టర్ రాము ప్రకాష్, పిట్ల సాయి, కరుణాకర్, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.