భారత్ సమాచార్, మెదక్ జిల్లా: కార్తీక మాసం సందర్భంగా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని NH-44 బైపాస్‌లో ఉన్న శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ గజవాడ లావణ్య నాగరాజు, వైస్ చైర్మన్ పోచమ్మల నవనీత గణేష్ శివమాలలు ధరించి ఆలయానికి చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా రానున్న రోజుల్లో ఎల్‌నినో ప్రభావంతో ప్రజలకు నీటి సమస్యలు తలెత్తకుండా చూడాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. అలాగే ప్రజలందరూ…