భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

12, నవంబర్ 2026, గురువారంభారత్ సమాచార్

లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి

ఆర్ వెంకటాపూర్లో ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగా మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఆర్. వెంకటాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ప్రత్యేక అధికారి, ఎంపీడీవో షాజీలుద్దీన్ పరిశీలించారు. గ్రామంలో ఇళ్ల నిర్మాణాల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.

ఆర్ వెంకటాపూర్లో ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన

ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహకారం, ప్రోత్సాహాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి గ్రామంలో అర్హులైన లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకోవడానికి ముందుకు రావాలని కోరారు.

ఆర్ వెంకటాపూర్లో ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన

ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను ఉపయోగించుకుని సొంతింటి కలను సాకారం చేసుకోవాలని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేద కుటుంబాలకు సొంత ఇల్లు సమకూర్చుకునే అవకాశం లభిస్తోందని, లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ పరిశీలన కార్యక్రమంలో గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు.