భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

12, నవంబర్ 2026, గురువారంభారత్ సమాచార్

ధర్మారంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

రామన్ పేట్ మండలం ప్రగతి ధర్మారంలో స్మార్ట్ రేషన్ కళ్ళ పంపిణీ

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన రేషన్ కార్డులు, డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం రామాయంపేట మండలం ధర్మారం గ్రామంలో గురువారం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, ఉప సర్పంచ్ లలిత ఆధ్వర్యంలో అర్హులైన లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులతో పాటు స్మార్ట్ కార్డులను అందజేశారు.

రామన్ పేట్ మండలం ప్రగతి ధర్మారంలో స్మార్ట్ రేషన్ కళ్ళ పంపిణీ

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అర్హులైన ప్రజలకు కొత్త రేషన్ కార్డులు, డిజిటల్ స్మార్ట్ కార్డులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు.

రామన్ పేట్ మండలం ప్రగతి ధర్మారంలో స్మార్ట్ రేషన్ కళ్ళ పంపిణీ

ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కొత్త రేషన్ కార్డులు, స్మార్ట్ కార్డులు అందుకున్న లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.