భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన రేషన్ కార్డులు, డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం రామాయంపేట మండలం ధర్మారం గ్రామంలో గురువారం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, ఉప సర్పంచ్ లలిత ఆధ్వర్యంలో అర్హులైన లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులతో పాటు స్మార్ట్ కార్డులను అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అర్హులైన ప్రజలకు కొత్త రేషన్ కార్డులు, డిజిటల్ స్మార్ట్ కార్డులను…