భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

12, నవంబర్ 2026, గురువారంభారత్ సమాచార్

లక్ష్మాపూర్‌లో అధికారుల ఆకస్మిక తనిఖీలు.. క్లినిక్ సీజ్

అర్హత లేకుండా వైద్యం మోహన్ క్లినిక్ సీజ్
అర్హత లేకుండా వైద్యం మోహన్ క్లినిక్ సీజ్

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: అర్హత లేకుండా వైద్యం అందిస్తున్నారనే కారణంతో మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామంలోని మోహన్ క్లినిక్‌ను వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సీజ్ చేశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఘనేశ్వర్ ఆదేశాల మేరకు అధికారులు ఆకస్మికంగా క్లినిక్‌ను తనిఖీ చేసి ఈ చర్యలు తీసుకున్నారు.

అర్హత లేకుండా వైద్యం మోహన్ క్లినిక్ సీజ్

ఈ తనిఖీల్లో డాక్టర్ హరి ప్రసాద్, ఇంచార్జ్ డీవో డాక్టర్ హరిప్రియ, PHC ఇంచార్జ్ అన్వర్, డెమో కొండయ్య, CHO పాల్గొన్నారు. క్లినిక్‌లో వైద్యం కోసం ఉపయోగిస్తున్న మందులు, ఇంజక్షన్లు, సెలైన్, గ్లూకోజ్ బాటిళ్లతో పాటు రిజిస్టర్లు, ప్రిస్క్రిప్షన్ చిట్టీలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు.

అర్హత లేకుండా వైద్యం మోహన్ క్లినిక్ సీజ్

ఈ సందర్భంగా క్లినిక్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్ట నిబంధనలకు విరుద్ధంగా వైద్యం అందిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిబంధనల ఉల్లంఘనపై క్లినిక్ నిర్వాహకులకు నోటీసు జారీ చేసి, అనంతరం మోహన్ క్లినిక్‌ను సీజ్ చేశారు.

అర్హత లేకుండా వైద్యం మోహన్ క్లినిక్ సీజ్

తనిఖీ సందర్భంగా డాక్టర్ హరి ప్రసాద్ మాట్లాడుతూ.. ఆర్ఎంపీలు, పీఎంపీలు తమ పరిధిలో కేవలం ప్రథమ చికిత్స మాత్రమే అందించాలని సూచించారు. గాయాలకు మందు పూయడం, కట్లు కట్టడం వంటి ప్రాథమిక సేవలకే పరిమితం కావాలని స్పష్టం చేశారు. అర్హత, అనుమతులు లేకుండా వైద్యం అందించడం చట్టవిరుద్ధమని, ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.