భారత్ సమాచార్, మెదక్ జిల్లా: అర్హత లేకుండా వైద్యం అందిస్తున్నారనే కారణంతో మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామంలోని మోహన్ క్లినిక్‌ను వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సీజ్ చేశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఘనేశ్వర్ ఆదేశాల మేరకు అధికారులు ఆకస్మికంగా క్లినిక్‌ను తనిఖీ చేసి ఈ చర్యలు తీసుకున్నారు.
ఈ తనిఖీల్లో డాక్టర్ హరి ప్రసాద్, ఇంచార్జ్ డీవో డాక్టర్ హరిప్రియ, PHC ఇంచార్జ్ అన్వర్, డెమో కొండయ్య, CHO పాల్గొన్నారు. క్లినిక్‌లో వైద్యం కోసం ఉపయోగిస్తున్న మందులు, ఇంజక్షన్లు,…






