భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మండలంలోని రత్తిరామ్ తండాకు చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గుగులోతు బాలాజీ నాయక్ ఇటీవల తన తండ్రి దస్రు నాయక్‌ను కోల్పోయారు. ఈ విషయం తెలుసుకున్న మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన కుటుంబాన్ని పరామర్శించి అండగా నిలిచారు.
ఈ సందర్భంగా స్వర్గీయ దస్రు నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బాలాజీ నాయక్‌తో పాటు కుటుంబ సభ్యులను కలిసి వారి బాధలో పాలుపంచుకున్నారు. తండ్రిని కోల్పోయిన బాధలో ఉన్న కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కష్టసమయంలో మనోధైర్యాన్ని కోల్పోకుండా ఉండాలని సూచించారు.
పరామర్శించిన సర్పంచులు
బాలాజీ నాయక్‌ను పరామర్శించిన వారిలో మాదరి ప్రశాంత్, బొల్లికొండ చైతన్య, తూర్పటి శంకరయ్య, గుగులోత్ కరుణ మధు, భూక్యా వీరన్న, యాసం సంధ్య రమేష్, గుగులోత్ అశోక్, కత్తుల కళ్యాణి యాకంతం, గోగుల మమతా ప్రశాంత్, గొడుగు జ్యోతి రామకృష్ణ, గుండె బోయిన ఉష అశోక్, గుగులోత్ హేమలత శ్రీనివాస్ ఉన్నారు.
పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు
అలాగే DCC మాజీ అధ్యక్షుడు భరత్ చంద్ర రెడ్డి, జిల్లా, మండల స్థాయి నాయకులు ప్రకాశ్ రెడ్డి, రాంరెడ్డి, సత్యపాల్ రెడ్డి, సాయి, సునీల్ నాయక్, రాజేష్, ఝాన్సీ నరేష్ నాయక్‌తో పాటు స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు బాలాజీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ కష్ట సమయంలో అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.