భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మండలంలోని రత్తిరామ్ తండాకు చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గుగులోతు బాలాజీ నాయక్ ఇటీవల తన తండ్రి దస్రు నాయక్‌ను కోల్పోయారు. ఈ విషయం తెలుసుకున్న మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన కుటుంబాన్ని పరామర్శించి అండగా నిలిచారు.

ఈ సందర్భంగా స్వర్గీయ దస్రు నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బాలాజీ నాయక్‌తో పాటు కుటుంబ సభ్యులను కలిసి వారి బాధలో పాలుపంచుకున్నారు. తండ్రిని కోల్పోయిన బాధలో…