భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

12, నవంబర్ 2026, గురువారంభారత్ సమాచార్

MBBS సీటు సాధించిన చందనకు ఆర్థిక చేయూత

కొండపాక మండలం కేంద్రంలో ఎంబీబీఎస్ సీట్ సాధించిన చందనకు చేయూత అందించిన చిట్కుల్ మైపాల్ రెడ్డి
కొండపాక మండలం కేంద్రంలో ఎంబీబీఎస్ సీట్ సాధించిన చందనకు చేయూత అందించిన చిట్కుల్ మైపాల్ రెడ్డి

భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: కష్టపడి చదివి MBBS సీటు సాధించిన విద్యార్థిని కొమ్ము చందనకు వైద్య విద్య కొనసాగించేందుకు ఆర్థిక చేయూత అందించారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చిట్కుల మహిపాల్ రెడ్డి. కొండపాక మండల కేంద్రానికి చెందిన చందన ప్రభుత్వ మెడికల్ కాలేజీలో MBBS సీటు సాధించడంతో ఆమె చదువుకు అండగా నిలిచారు.

కొండపాక మండలం కేంద్రంలో ఎంబీబీఎస్ సీట్ సాధించిన చందనకు చేయూత అందించిన చిట్కుల్ మైపాల్ రెడ్డి

చిట్కుల మహిపాల్ రెడ్డి తన తల్లిదండ్రుల పేర్లతో ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మి రాంరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ సాయం అందించారు. తన కుమారుడు చిట్కుల మణిదీప్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా చందన మొదటి సంవత్సరం ఫీజు కోసం ₹.27వేల నగదును ట్రస్ట్ తరఫున అందజేశారు. విద్యార్థిని వైద్య విద్యకు అవసరమైన ఆర్థిక సహాయం అందించడం ద్వారా ఆమె చదువుకు తోడ్పాటునిచ్చారు.

కొండపాక మండలం కేంద్రంలో ఎంబీబీఎస్ సీట్ సాధించిన చందనకు చేయూత అందించిన చిట్కుల్ మైపాల్ రెడ్డి

ఈ సందర్భంగా చిట్కుల మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు చందనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. పట్టుదల, కష్టపడి చదివే తత్వంతో ఉన్నత లక్ష్యాలను సాధించాలని, భవిష్యత్తులో మంచి ప్రయోజకులుగా ఎదిగి తల్లిదండ్రులకు, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

కొండపాక మండలం కేంద్రంలో ఎంబీబీఎస్ సీట్ సాధించిన చందనకు చేయూత అందించిన చిట్కుల్ మైపాల్ రెడ్డి

ఈ కార్యక్రమంలో చందన తండ్రి నర్సింలు, తమ్ముడు సతీష్‌తో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.