భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: కష్టపడి చదివి MBBS సీటు సాధించిన విద్యార్థిని కొమ్ము చందనకు వైద్య విద్య కొనసాగించేందుకు ఆర్థిక చేయూత అందించారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చిట్కుల మహిపాల్ రెడ్డి. కొండపాక మండల కేంద్రానికి చెందిన చందన ప్రభుత్వ మెడికల్ కాలేజీలో MBBS సీటు సాధించడంతో ఆమె చదువుకు అండగా నిలిచారు.
చిట్కుల మహిపాల్ రెడ్డి తన తల్లిదండ్రుల పేర్లతో ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మి రాంరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ సాయం అందించారు. తన కుమారుడు చిట్కుల…






