భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

13, నవంబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

లక్ష్మీపురంలో కొత్త వైకుంఠధామం ప్రారంభం

లక్ష్మీపురంలో వైకుంఠధామం ప్రారంభం

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో కొత్తగా నిర్మించిన వైకుంఠధామాన్ని శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. గ్రామ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేలా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మానుకోట మున్సిపల్ చైర్‌పర్సన్ గుగులోతు జ్యోతి రమేష్, డీసీసీ అధ్యక్షురాలు డా. ఉమా మురళి నాయక్, మాజీ డీసీసీ అధ్యక్షుడు భరత్ చంద్రారెడ్డి పాల్గొన్నారు. స్థానిక సర్పంచి ముదిరెడ్డి కళావతి, శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి వైకుంఠధామాన్ని ప్రారంభించి వినియోగంలోకి తీసుకొచ్చారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. మనిషి మరణించిన తర్వాత అంతిమ సంస్కారాలను గౌరవప్రదంగా నిర్వహించేందుకు వైకుంఠధామాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి సౌకర్యాలు అందుబాటులో ఉండటం ప్రజలకు ఎంతో అవసరమన్నారు. గ్రామ ప్రజల అవసరాలను గుర్తించి వైకుంఠధామం నిర్మాణం చేపట్టి అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని చెప్పారు.

గ్రామంలో అభివృద్ధి పనులపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్న సర్పంచి దంపతులు ముదిరెడ్డి కళావతి, శ్రీనివాస్ రెడ్డిలను నాయకులు అభినందించారు. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్న పాలకవర్గాన్ని కూడా ప్రశంసించారు. ప్రజలకు ఉపయోగపడే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మణిదీప్, నాయకులు వెంకట్ రెడ్డి, భూక్యా లాలు, ముత్యాల వెంకన్న, లచ్చయ్య, బాణాల వెంకన్న, తేజావత్ పరమేష్, యాకూబ్ రెడ్డి, బిక్షం చంద్రారెడ్డి, చిన్న వెంకన్నతోపాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.