భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండల కేంద్రం, ఆలేరు స్టేజీ వద్ద ఎక్స్‌ప్రెస్ బస్సుకు హాల్టింగ్ సౌకర్యం కల్పించాలని జర్నలిస్టులు చేసిన విజ్ఞప్తిపై TSRTC అధికారులు సానుకూలంగా స్పందించారు. ఇల్లందు డిపో నుంచి నెల్లికుదురు మీదుగా హైదరాబాద్‌లోని మియాపూర్‌కు వెళ్లే ఎక్స్‌ప్రెస్ బస్సును ఈ రెండు ప్రాంతాల్లోనూ నిలిపేలా చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు కోరారు.
సామాజిక కార్యకర్త, సీనియర్ జర్నలిస్ట్ బొడ్డు అశోక్ నేతృత్వంలో సీనియర్ జర్నలిస్టులు చందా శ్రీనివాస్, గొడుగు శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం ఇల్లందు డిపో మేనేజర్ శుభాషిణిని కలిశారు. ఈ సందర్భంగా ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆమెకు వివరించి వినతిపత్రం అందజేశారు.
ఇల్లందు డిపో నుంచి హైదరాబాద్‌లోని మియాపూర్‌కు వెళ్లే ఎక్స్‌ప్రెస్ బస్సుకు నెల్లికుదురు మండల కేంద్రం, ఆలేరు స్టేజీ వద్ద హాల్టింగ్ లేకపోవడంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని జర్నలిస్టులు తెలిపారు. ముఖ్యంగా సాయంత్రం వేళ హైదరాబాద్‌కు వెళ్లే ప్రయాణికులు బస్సు ఎక్కేందుకు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందని వివరించారు.
ఈ రెండు ప్రాంతాల్లో బస్సు నిలుపుదల సౌకర్యం కల్పిస్తే నెల్లికుదురు, ఆలేరు పరిసర గ్రామాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, హైదరాబాద్‌కు వెళ్లే ప్రయాణికులకు ప్రయాణం మరింత సులభమవుతుందని కోరారు.
జర్నలిస్టులు అందించిన వినతిపై డిపో మేనేజర్ శుభాషిణి సానుకూలంగా స్పందించినట్లు బొడ్డు అశోక్ తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్న జర్నలిస్టుల చొరవను పలువురు అభినందిస్తున్నారు.