భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

13, నవంబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

హుస్సేన్ నాయక్ చొరవతో గ్రామంలో సోలార్ లైట్లు

హుస్సేన్ నాయక్ సహకారం.. నెల్లికుదురులో సోలార్ లైట్స్ ఏర్పాటు..

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండల కేంద్రంలో రాత్రివేళల్లో ప్రజలకు మెరుగైన సౌకర్యం కల్పించేందుకు సోలార్ లైట్లు ఏర్పాటు చేశారు. జాతీయ ST కమిషన్ సభ్యుడు గుగులోతు హుస్సేన్ నాయక్ సహకారంతో NTPC సంస్థ CSR నిధుల ద్వారా ఈ లైట్లను ఏర్పాటు చేసినట్లు BJP నాయకులు తెలిపారు.

హుస్సేన్ నాయక్‌కు BJP కృతజ్ఞతలు

ఈ సందర్భంగా BJP మండల శాఖ అధ్యక్షుడు చందు రాజ్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. మండల కేంద్రంలోని పలు ప్రాంతాల్లో రాత్రివేళల్లో వెలుతురు సరిగా లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని తమ అభ్యర్థన మేరకు హుస్సేన్ నాయక్ సోలార్ లైట్లు మంజూరు చేయించి ఏర్పాటు చేయించారని చెప్పారు. ఈ సహకారంతో రాత్రి వేళల్లో ప్రజలకు మెరుగైన సౌకర్యం కలుగుతుందని పేర్కొన్నారు.

హుస్సేన్ నాయక్ సహకారం.. నెల్లికుదురులో సోలార్ లైట్స్ ఏర్పాటు..

రాష్ట్రంలో BJP అధికారంలో లేకపోయినప్పటికీ హుస్సేన్ నాయక్ CSR నిధుల ద్వారా పలు ప్రజా ప్రయోజన కార్యక్రమాలకు సహకరిస్తున్నారని రాజ్ కుమార్ తెలిపారు. మినరల్ వాటర్ ప్లాంట్ల ఏర్పాటు, ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, రైతులకు స్ప్రే పంపులు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికలకు సైకిళ్ల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు.

నెల్లికుదురులో సోలార్ లైట్లు ఏర్పాటు చేయించడంలో సహకరించిన హుస్సేన్ నాయక్‌కు ఈ సందర్భంగా రాజ్ కుమార్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ యాదగిరి రెడ్డి, వెన్నాకుల శ్రీనివాస్, గడ్డం యాలాద్రి తదితరులు పాల్గొన్నారు.