భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

13, నవంబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

భక్తిశ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు

భక్తిశ్రద్ధలతో నాగుల చవితి

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నాగుల చవితి పండుగను పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లాలోని ఇనుగుర్తి, నెల్లికుదురు మండల కేంద్రాలతో పాటు వివిధ గ్రామాల్లో శుక్రవారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసంలో దీపావళి అమావాస్య తర్వాత వచ్చే శుద్ధ చవితి రోజున జరుపుకునే ఈ పండుగను ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.

భక్తిశ్రద్ధలతో నాగుల చవితి

ఇనుగుర్తి మండలం మీట్యా తండా సమీపంలోని నాగదేవత ఆలయం వద్ద భక్తుల సందడి కనిపించింది. ఆలయ పరిసరాల్లోని పుట్ట వద్ద చిన్న నాగారం సహా వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు పూజలు చేశారు. నాగదేవతకు ఆవు పాలు, పూజా ద్రవ్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ సందర్భంగా మహిళలు ప్రత్యేకంగా పూజలు నిర్వహించి నాగదేవతను భక్తితో కొలిచారు. తమ పిల్లలు ఆయురారోగ్యాలతో ఉండాలని, కుటుంబంలో సుఖసంతోషాలు, సౌభాగ్యం కలగాలని కోరుకుంటూ ఉపవాస దీక్షలు ఆచరించారు. పండుగ సందర్భంగా గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.