భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నాగుల చవితి పండుగను పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లాలోని ఇనుగుర్తి, నెల్లికుదురు మండల కేంద్రాలతో పాటు వివిధ గ్రామాల్లో శుక్రవారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసంలో దీపావళి అమావాస్య తర్వాత వచ్చే శుద్ధ చవితి రోజున జరుపుకునే ఈ పండుగను ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
ఇనుగుర్తి మండలం మీట్యా తండా సమీపంలోని నాగదేవత ఆలయం వద్ద భక్తుల సందడి కనిపించింది. ఆలయ పరిసరాల్లోని పుట్ట వద్ద చిన్న నాగారం సహా వివిధ గ్రామాల…






