భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

14, నవంబర్ 2026, శనివారంభారత్ సమాచార్

విద్యార్థులకు సర్పంచ్ అదిరిపోయే ఆఫర్!

అక్కన్నపేట గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్
అక్కన్నపేట గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: బాలల దినోత్సవం సందర్భంగా రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో కలిసి గ్రామ సర్పంచ్ బక్కన్నగారి యాదగిరి సందడి చేశారు. పిల్లలతో సరదాగా ఆటపాటల్లో పాల్గొని, వారి చదువులు, పాఠశాలలో ఉన్న వసతులు, ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆరా తీశారు.

అక్కన్నపేట గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్

ఈ సందర్భంగా పేద విద్యార్థులకు అండగా ఉంటానని సర్పంచ్ యాదగిరి భరోసా ఇచ్చారు. చదువుకోవడానికి అవసరమైన పుస్తకాలు సహా ఇతర విద్యా సామగ్రి విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని, అవసరమైన సహాయం అందిస్తానని చెప్పారు. విద్యార్థులు చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి మంచి ఫలితాలు సాధించాలని ప్రోత్సహించారు.

అక్కన్నపేట గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్

ముఖ్యంగా ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షల్లో క్లాస్ ఫస్ట్ సాధించిన విద్యార్థికి ₹.5వేలు నగదు బహుమతిగా అందజేస్తానని ప్రకటించారు. ఈ ప్రోత్సాహకం విద్యార్థుల్లో చదువుపై ఆసక్తిని పెంచుతుందని, మరింత కష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

అక్కన్నపేట గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్

అనంతరం పాఠశాల విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బి. యాదగిరి, పంచాయతీ సెక్రటరీ సువర్ణ, వార్డు సభ్యులు శివ, వెంకటేష్ గౌడ్, శ్రీకాంత్, సాగర్, రమేష్, అంగన్‌వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.