భారత్ సమాచార్, మెదక్ జిల్లా: బాలల దినోత్సవం సందర్భంగా రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో కలిసి గ్రామ సర్పంచ్ బక్కన్నగారి యాదగిరి సందడి చేశారు. పిల్లలతో సరదాగా ఆటపాటల్లో పాల్గొని, వారి చదువులు, పాఠశాలలో ఉన్న వసతులు, ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆరా తీశారు.

ఈ సందర్భంగా పేద విద్యార్థులకు అండగా ఉంటానని సర్పంచ్ యాదగిరి భరోసా ఇచ్చారు. చదువుకోవడానికి అవసరమైన పుస్తకాలు సహా ఇతర విద్యా సామగ్రి విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తన దృష్టికి…