భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

14, నవంబర్ 2026, శనివారంభారత్ సమాచార్

ప్రగతి ధర్మారంలో లబ్ధిదారులకు చెక్కులు అందజేత

ధర్మారం గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెట్ల పంపిణీ

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన చెక్కులను ముగ్గురు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో రామాయంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బండారి మహేందర్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాసాయిపేట మల్లేశం, గ్రామ సర్పంచ్ బండారి శ్రీనివాస్ గౌడ్, జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కుమార్ సాగర్, వార్డు సభ్యుడు కామారం సుమన్, గ్రామ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ సాకలి నారాయణ చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.

సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని ముగ్గురు లబ్ధిదారులకు అందించడం ద్వారా వారికి కొంత ఊరట లభించింది. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు లబ్ధిదారులకు చెక్కులు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ లీడర్ దొమ్మాట రవీందర్, మండల యువత నాయకుడు పెట్టేరి నాగరాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వడ్ల శ్రీశైలం, గ్రామ మాజీ సర్పంచ్ బొడ్డు శంకర్, యువ నాయకులు కట్ట భాస్కర్, జక్కుల శ్రీనివాస్, మాజీ ఉపసర్పంచ్ గాండ్ల సిద్ధిరాములు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.