భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

14, నవంబర్ 2026, శనివారంభారత్ సమాచార్

దివ్యాంగులకు అండగా హుస్సేన్ నాయక్.. ట్రై సైకిళ్ల అందజేత

హుస్సేన్ నాయక్ సహకారం.. దివ్యాంగులకు మోటార్రైజ్డ్ ట్రై సైకిల్స్ అందజేత..

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: దివ్యాంగులకు అండగా నిలిచేందుకు జాతీయ ST కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ చేసిన కృషితో మానుకోట నియోజకవర్గంలో 60 మంది దివ్యాంగులకు మోటరైజ్డ్ ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. ALIMCO CSR కార్యక్రమం ద్వారా శనివారం మహబూబాబాద్‌లో నిర్వహించిన ఈ పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారులకు యాంత్రిక మూడు చక్రాల సైకిళ్లు అందజేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఇనుగుర్తి మండలంలోని మీట్యా తండా, ఇనుగుర్తి, చిన్ననాగారం, చీన్య తండా గ్రామాలకు చెందిన దివ్యాంగులకు కూడా మోటరైజ్డ్ ట్రై సైకిళ్లు అందాయి. వీటి ద్వారా దివ్యాంగులు తమ రోజువారీ ప్రయాణాల్లో ఇతరులపై ఆధారపడకుండా కొంత స్వయంగా వెళ్లేందుకు అవకాశం కలుగుతుందని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ.. హుస్సేన్ నాయక్ ఎమ్మెల్యేగా ఎన్నిక కాకపోయినా నియోజకవర్గ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజలకు అవసరమైన సహాయం అందించడంతో పాటు సామాజిక కార్యక్రమాలను కూడా చేపడుతున్నారని చెప్పారు. దివ్యాంగుల అవసరాలను గుర్తించి మోటరైజ్డ్ ట్రై సైకిళ్లు అందించేందుకు సహకరించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

హుస్సేన్ నాయక్ సహకారం.. దివ్యాంగులకు మోటార్రైజ్డ్ ట్రై సైకిల్స్ అందజేత..

హుస్సేన్ నాయక్‌కు నవీన్ నాయక్ కృతజ్ఞతలు

మరోవైపు, ఇనుగుర్తి మండలం మీట్యా తండాకు చెందిన BJP జిల్లా యువ నేత గుగులోతు నవీన్ నాయక్ జాటోతు హుస్సేన్ నాయక్‌కు కృతజ్ఞతలు తెలిపారు. దివ్యాంగులకు మోటరైజ్డ్ ట్రై సైకిళ్లు అందేలా కృషి చేసినందుకు అభినందనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా నవీన్ నాయక్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో BJP అధికారంలో లేకపోయినా హుస్సేన్ నాయక్ CSR నిధులను పెద్ద మొత్తంలో తీసుకొస్తూ పలు సామాజిక సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్నారని పేర్కొన్నారు. రైతులకు స్ప్రే పంపులు, మహిళలకు కుట్టు మిషన్లు, ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికలకు సైకిళ్లు అందించడంతో పాటు ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు.

నియోజకవర్గ ప్రజలకు అవసరమైన సహాయం అందించేందుకు హుస్సేన్ నాయక్ చేస్తున్న సేవలను ప్రజలు గుర్తిస్తున్నారని, ఆయనకు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారని నవీన్ నాయక్ తెలిపారు.