భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: దివ్యాంగులకు అండగా నిలిచేందుకు జాతీయ ST కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ చేసిన కృషితో మానుకోట నియోజకవర్గంలో 60 మంది దివ్యాంగులకు మోటరైజ్డ్ ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. ALIMCO CSR కార్యక్రమం ద్వారా శనివారం మహబూబాబాద్‌లో నిర్వహించిన ఈ పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారులకు యాంత్రిక మూడు చక్రాల సైకిళ్లు అందజేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఇనుగుర్తి మండలంలోని మీట్యా తండా, ఇనుగుర్తి, చిన్ననాగారం, చీన్య తండా గ్రామాలకు చెందిన దివ్యాంగులకు కూడా మోటరైజ్డ్ ట్రై…






