భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

14, నవంబర్ 2026, శనివారంభారత్ సమాచార్

బాలాజీ నాయక్ కుటుంబానికి ఇనుగుర్తి కాంగ్రెస్ నేతల పరామర్శ

బాలాజీ నాయక్ కు ఇనుగుర్తి కాంగ్రెస్ నేతల పరామర్శ..

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలం రత్తి రామ్ తండాకు చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నేత గుగులోతు బాలాజీ నాయక్ తండ్రి దస్రు నాయక్ ఇటీవల కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న ఇనుగుర్తి మండల కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఆదివారం రత్తి రామ్ తండాకు చేరుకుని దస్రు నాయక్ కుటుంబాన్ని పరామర్శించారు.

ఈ సందర్భంగా దస్రు నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బాలాజీ నాయక్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ ఈ కష్ట సమయంలో అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

అనంతరం కాంగ్రెస్ పార్టీ ఇనుగుర్తి మండల అధ్యక్షుడు బైరు అశోక్ గౌడ్ మాట్లాడుతూ.. దస్రు నాయక్ మృతి పట్ల ఇనుగుర్తి మండల కాంగ్రెస్ పార్టీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోందని తెలిపారు. ఆయన మరణం బాధాకరమని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని చెప్పారు.

బాలాజీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన వారిలో ప్రజాప్రతినిధులతో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులు బైరు అశోక్ గౌడ్, బానోతు వీరన్న నాయక్, కాలేరు శివాజీ, రాజేందర్ రెడ్డి, ముదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, చెడుపాక యాకయ్య, ప్రభాకర్, బానోతు బాలు, భూక్య వెంకన్న నాయక్, నారు నాయక్ తదితరులు ఉన్నారు.