భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, నెల్లికుదురు మండలం నైనాల గ్రామానికి చెందిన పెరుమాండ్ల గుట్టయ్య గౌడ్ జన్మదిన వేడుకలు శనివారం హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఘనంగా నిర్వహించారు. మాజీ ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న గుట్టయ్య గౌడ్ పుట్టినరోజు వేడుకలకు పలువురు నాయకులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు హాజరై సందడి చేశారు.
ఈ వేడుకలకు బహుజన యుద్ధనౌక మారోజు వీరన్న కుమార్తె దిశ ప్రత్యేకంగా హాజరయ్యారు. గుట్టయ్య గౌడ్‌తో పాటు కార్యక్రమానికి వచ్చిన అతిథులు కలిసి జన్మదిన కేక్ కట్ చేశారు. అనంతరం అక్కడున్న వారికి మిఠాయిలు పంచిపెట్టి పుట్టినరోజు సంబరాలను ఆనందంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా మానుకోట మాజీ సర్పంచ్ భూక్య నెహ్రూ నాయక్ తదితరులు మాట్లాడుతూ.. గుట్టయ్య గౌడ్ మంచి ఆరోగ్యంతో, మరింత ఉత్సాహంగా ప్రజాసేవలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ప్రజల కోసం ఆయన చేస్తున్న సేవలు మరింత విస్తరించాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని కోరుకున్నారు.
గుట్టయ్య గౌడ్ ప్రజాసేవలో మరింతగా రాణించాలని ఆకాంక్షిస్తూ పాటలు పాడి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దీంతో ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో వేడుకలు సందడిగా సాగాయి.
ఈ కార్యక్రమంలో ట్రైబల్ JAC నాయకులు రవీందర్ రాథోడ్, సురేష్ నాయక్, భాస్కర్ నాయక్, నరేష్ నాయక్, లక్ష్మణ్ ముదిరాజ్తో పాటు వివిధ విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. అందరూ కలిసి పెరుమాండ్ల గుట్టయ్య గౌడ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.