భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

15, నవంబర్ 2026, ఆదివారంభారత్ సమాచార్

మొక్కల పెంపకంలో నేచర్ కేర్ ట్రస్ట్ కృషి భేష్

చెట్ల పెంపకంలో నేచర్ కేర్ ట్రస్ట్ కృషి అభినందనీయం..                                  సర్పంచి ప్రశాంత

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామాల్లో పచ్చదనం పెంపొందించేందుకు నేచర్ కేర్ ట్రస్ట్ చేస్తున్న కృషి అభినందనీయమని నెల్లికుదురు సర్పంచి మాదరి ప్రశాంత్ అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.

మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని శ్రీరామగిరి గ్రామంలో ఆదివారం నేచర్ కేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచి మాదరి ప్రశాంత్, నేచర్ కేర్ ట్రస్ట్ చైర్మన్ బండారు శ్రీ వెంకటరమణ ముఖ్య అతిథులుగా హాజరై మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో వాహనాలు, పరిశ్రమల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో పర్యావరణ కాలుష్యం తీవ్రంగా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు అడవుల నరికివేత కారణంగా ప్రకృతి సమతుల్యత దెబ్బతింటోందని అన్నారు. ఈ పరిస్థితుల వల్ల వాతావరణంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయని, వర్షాభావ పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. ఎల్‌నినో వంటి వాతావరణ పరిణామాలు మానవ మనుగడకు సవాలుగా మారుతున్నాయని తెలిపారు.

చెట్ల పెంపకంలో నేచర్ కేర్ ట్రస్ట్ కృషి అభినందనీయం..                                  సర్పంచి ప్రశాంత

ప్రకృతిని కాపాడుకోవాలంటే చెట్ల పెంపకానికి ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా నేచర్ కేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వివిధ గ్రామాల్లో వీలైనన్ని ఎక్కువ మొక్కలు నాటడంతో పాటు పచ్చదనాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నట్లు ట్రస్ట్ చైర్మన్ బండారు శ్రీ వెంకటరమణ తెలిపారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యతను కూడా ప్రతి ఒక్కరూ తీసుకోవాలని కోరారు.

గ్రామాల్లో పచ్చదనం పెరిగితే పర్యావరణ సమతుల్యతకు మేలు జరగడంతో పాటు భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందించినవారమవుతామని వారు పేర్కొన్నారు. ప్రకృతి పరిరక్షణను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచి రామగిరి సుమన్, ట్రస్ట్ సభ్యులు తోట లాలయ్య, మడత వెంకన్న, గ్రామ పెద్దలు గొల్లపెల్లి ప్రభాకర్ గౌడ్, ఫీల్డ్ అసిస్టెంట్ గుగులోత్ నాగమణి, అంగన్‌వాడీ టీచర్లు గుగులోత్ అరుణ, గుగులోత్ సునీత, మద్దెల సమ్మయ్య, రామగిరి సంతోష్, సంద కృష్ణ, గుర్రాల నరేష్, ఎడ్ల మహేష్, పోతరాజు శ్రీశైలం, పోతరాజు యాకన్న తదితరులు పాల్గొన్నారు.