భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామాల్లో పచ్చదనం పెంపొందించేందుకు నేచర్ కేర్ ట్రస్ట్ చేస్తున్న కృషి అభినందనీయమని నెల్లికుదురు సర్పంచి మాదరి ప్రశాంత్ అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.

మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని శ్రీరామగిరి గ్రామంలో ఆదివారం నేచర్ కేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచి మాదరి ప్రశాంత్, నేచర్ కేర్ ట్రస్ట్ చైర్మన్ బండారు శ్రీ వెంకటరమణ ముఖ్య అతిథులుగా…