భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

15, నవంబర్ 2026, ఆదివారంభారత్ సమాచార్

నల్లగొండకు తరలిన నెల్లికుదురు సిపిఎం నాయకులు

మహాసభలకు తరలిన నెల్లికుదురు సిపిఎం శ్రేణులు..

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: రైతాంగ సమస్యలు, రైతుల హక్కుల పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న అఖిలభారత కిసాన్ సభ (ఏఐకేఎస్) 36వ అఖిలభారత మహాసభలకు నెల్లికుదురు మండలానికి చెందిన సిపిఎం శ్రేణులు ఆదివారం తరలివెళ్లాయి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి కేంద్రంగా నిలిచిన నల్లగొండ జిల్లా కేంద్రంలో ఈ మహాసభలు నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి ఇసంపల్లి సైదులు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వ్యవసాయ రంగం భవిష్యత్తు, రైతుల హక్కుల పరిరక్షణ వంటి కీలక అంశాలపై ఈ మహాసభల్లో విస్తృతంగా చర్చించనున్నట్లు తెలిపారు. రైతాంగ సమస్యలను జాతీయ స్థాయిలో ప్రస్తావించేందుకు, రైతుల హక్కుల కోసం భవిష్యత్తు పోరాట కార్యాచరణ రూపొందించేందుకు ఈ మహాసభలు కీలక వేదికగా నిలవనున్నాయని పేర్కొన్నారు.

వ్యవసాయ రంగంలో నెలకొన్న పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లు, వారి సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై దేశవ్యాప్తంగా ఉన్న రైతు సంఘాల ప్రతినిధులు ఈ మహాసభల్లో తమ అభిప్రాయాలను పంచుకోనున్నారని తెలిపారు. రైతాంగ ఐక్యతను మరింత బలోపేతం చేయడంతో పాటు హక్కుల సాధన కోసం సంఘటితంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ఈ మహాసభలకు తరలివెళ్లిన వారిలో సిపిఎం మండల కార్యదర్శి ఇసంపల్లి సైదులు, నాయకులు పెరుమాండ్ల బాబు గౌడ్, తోట నరసయ్య, వెంకన్న, పుల్లయ్య, చంద్రయ్య, ఉప్పలయ్య, శ్రీను, పద్మ, సంగీత, ఎల్లయ్య, బాణాల యాకయ్య, మచ్చ వెంకన్న, పాయిలి వెంకన్న, ముత్తయ్య, ఏ. జనార్ధన్ తదితరులు ఉన్నారు.