భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

15, నవంబర్ 2026, ఆదివారంభారత్ సమాచార్

దుఃఖంలో ఉన్న కుటుంబానికి కాంగ్రెస్ నేతల భరోసా

ఎల్దొండ సోదరులకు కాంగ్రెస్ నేతల పరామర్శ

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మాతృవియోగంతో బాధలో ఉన్న ఎల్దొండ సోదరులను నెల్లికుదురు మండల కాంగ్రెస్ నాయకులు ఆదివారం పరామర్శించి ధైర్యం చెప్పారు. కష్టకాలంలో పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

ఇనుగుర్తి (పూర్వ నెల్లికుదురు) మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ జిల్లా నాయకుడు ఎల్దొండ వెంకటరెడ్డి, మాజీ సర్పంచ్, BRS నాయకుడు ఎల్దొండ నారాయణరెడ్డి ఇటీవల తమ తల్లిని కోల్పోయారు. ఈ విషయం తెలుసుకున్న నెల్లికుదురు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎదల్ల యాదవ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ నాయకులు ఆదివారం లక్ష్మీపురం గ్రామానికి చేరుకున్నారు.

ఎల్దొండ సోదరులకు కాంగ్రెస్ నేతల పరామర్శ

ఈ సందర్భంగా స్వర్గీయ వెంకటమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎల్దొండ వెంకటరెడ్డి, నారాయణరెడ్డితో పాటు వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. తల్లిని కోల్పోయిన బాధ నుంచి కోలుకోవాలని, మనోధైర్యంతో ఉండాలని సూచిస్తూ ధైర్యవచనాలు చెప్పారు. ఈ కష్ట సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కుటుంబానికి అండగా ఉంటారని భరోసా ఇచ్చారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో స్థానిక సర్పంచి ముదిరెడ్డి కళావతి, శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభాకర్ గౌడ్, శ్రీపాల్ రెడ్డి, పొడెట్టి చంద్రయ్య, గండి మురళి, ముత్యాల లచ్చయ్య, వెంకటరెడ్డి, జగన్ బాబు, ముత్యాల వెంకన్న, గండేపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.