భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం నెల్లికుదురు మండల మహిళా అధ్యక్షురాలిగా బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామానికి చెందిన రామతార పద్మ గౌడ్ ఎంపికయ్యారు. ఈ మేరకు ఆదివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని లండన్ హై స్కూల్‌లో నిర్వహించిన సమావేశంలో సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గట్టు రామచంద్రయ్య గౌడ్ ఆమె నియామకాన్ని ప్రకటించి నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా గట్టు రామచంద్రయ్య గౌడ్ మాట్లాడుతూ.. గౌడ సామాజిక వర్గ సంక్షేమం, అభివృద్ధి కోసం మహిళా నాయకులు కూడా చురుగ్గా పనిచేయాలని సూచించారు. గౌడ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. సామాజికంగా, ఆర్థికంగా గౌడ వర్గం మరింత అభివృద్ధి చెందేలా సంఘం నాయకులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
సామాజిక, ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తా..
తనపై నమ్మకంతో మండల మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతలు అప్పగించినందుకు రామతార పద్మ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పారు. గౌడ జాతి అభ్యున్నతి, సంక్షేమం, సామాజిక, ఆర్థిక అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు.
గౌడ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు వాటి పరిష్కారానికి తన వంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు. ముఖ్యంగా గౌడ యువతకు విద్య, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కృషి చేస్తానన్నారు. మహిళల భాగస్వామ్యాన్ని పెంచుతూ సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు పనిచేస్తానని పేర్కొన్నారు.
తనకు ఈ బాధ్యతలు అప్పగించిన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గట్టు రామచంద్రయ్య గౌడ్, జిల్లా అధ్యక్షుడు గండి వీరేందర్ గౌడ్, ఉపాధ్యక్షుడు గండి సాయి గౌడ్, యువజన సంఘం అధ్యక్షుడు కరింగుల సాగర్ గౌడ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు గండి శారద గౌడ్‌లకు రామతార పద్మ గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Is this conversation helpful so far?