భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

15, నవంబర్ 2026, ఆదివారంభారత్ సమాచార్

గౌడ సంఘం నెల్లికుదురు మండల అధ్యక్షుడిగా శ్రీనివాస్ గౌడ్

తెలంగాణ  గౌడ సంక్షేమ సంఘం.. నెల్లికుదురు మండలాధ్యక్షునిగా శ్రీనివాస్ గౌడ్

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం నెల్లికుదురు మండల అధ్యక్షుడిగా వావిలాల గ్రామానికి చెందిన బొల్లెపల్లి శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు గట్టు రామచంద్రయ్య గౌడ్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా గట్టు రామచంద్రయ్య గౌడ్ మాట్లాడుతూ.. గౌడ జాతి అభ్యున్నతి, సంక్షేమం కోసం నూతన అధ్యక్షుడు ప్రత్యేకంగా కృషి చేయాలని సూచించారు. గౌడ సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి చొరవ చూపాలని అన్నారు. సంఘాన్ని మండల స్థాయిలో మరింత బలోపేతం చేస్తూ గౌడ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..

తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ గౌడ సమాజం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నూతన మండల అధ్యక్షుడు బొల్లెపల్లి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గౌడ సంఘం నాయకులు, సభ్యుల సహకారంతో సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు.

గౌడ జాతి అభ్యున్నతి, సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తానని, ముఖ్యంగా గౌడ యువతకు విద్య, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కృషి చేస్తానని చెప్పారు. గౌడ సమాజం సామాజికంగా, ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందేలా అందరినీ కలుపుకొని ముందుకు సాగుతానని పేర్కొన్నారు.

తనపై నమ్మకంతో మండల అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు గట్టు రామచంద్రయ్య గౌడ్, జిల్లా అధ్యక్షుడు గండి వీరేందర్ గౌడ్, ఉపాధ్యక్షుడు గండి సాయి గౌడ్, యువజన సంఘం అధ్యక్షుడు కరింగుల సాగర్ గౌడ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు గండి శారద గౌడ్‌లకు శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.