భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండల కుమ్మర సంఘం నూతన అడహాక్ కమిటీని ఆదివారం ఇనుగుర్తిలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం బలోపేతం, సామాజిక ఐక్యత, కుమ్మర సామాజిక వర్గ సమస్యల పరిష్కారం లక్ష్యంగా నూతన కమిటీని ఏర్పాటు చేశారు.
ఈ ఎన్నికల్లో మండల కన్వీనర్‌గా మాల్యాల కుమారస్వామి, కో-కన్వీనర్‌గా నాంపెల్లి ఐలయ్య, మహిళా అధ్యక్షురాలిగా కొత్తపల్లి శ్రీలత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే మండల కమిటీ సభ్యులుగా కొత్తపల్లి వెంకటేష్, అలవాల దామోదర్, సంగెం హరీష్‌లను ఎన్నుకున్నారు.
చిన్న ముప్పారంలో నూతన కమిటీ..
ఇనుగుర్తి మండలంలోని చిన్న ముప్పారం గ్రామ కుమ్మర సంఘం నూతన కమిటీని కూడా సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ సంఘం అధ్యక్షుడిగా కొత్తపల్లి యాకన్న, ఉపాధ్యక్షుడిగా కొత్తపల్లి వెంకన్న, కోశాధికారిగా అలవాల పుల్లయ్య, ప్రధాన కార్యదర్శిగా ఆకారపు వెంకట్రాములు ఎన్నికయ్యారు.
అలాగే సహాయ కార్యదర్శిగా కొత్తపల్లి నరేష్, గౌరవ అధ్యక్షుడిగా గణపారం వెంకన్నలను ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన నాయకులు సంఘం అభివృద్ధికి, సభ్యుల సంక్షేమానికి కృషి చేయాలని సభ్యులు ఆకాంక్షించారు.
మండల, గ్రామ స్థాయిలో కమిటీల ఏర్పాటు ద్వారా కుమ్మర సామాజిక వర్గాన్ని మరింత సంఘటితం చేయడంతో పాటు వారి సమస్యలను సమిష్టిగా పరిష్కరించుకునేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన కమిటీ సభ్యులకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.