భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

16, నవంబర్ 2026, సోమవారంభారత్ సమాచార్

రామాయంపేట కాంగ్రెస్ ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షుడిగా ఒద్ది స్వామి

రామాయంపేట కాంగ్రెస్ ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా నియమతులైన వృద్ధి స్వామి

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామాయంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీలో కీలక నియామకం జరిగింది. మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు ఆదేశాల మేరకు కాంగ్రెస్ ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షుడిగా ఒద్ది స్వామి ఏకగ్రీవంగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ గజవాడ లావణ్య నాగరాజు ఆయనకు నియామక పత్రాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి, బలోపేతానికి కృషి చేయాలని ఈ సందర్భంగా పలువురు నాయకులు ఆకాంక్షించారు. ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఒద్ది స్వామికి నాయకులు, ప్రజాప్రతినిధులు అభినందనలు తెలియజేశారు.

రామాయంపేట కాంగ్రెస్ ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా నియమతులైన వృద్ధి స్వామి

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పోచమ్మల నవనీత గణేష్, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు రమేష్ రెడ్డి, సరాఫ్ యాదగిరి, కౌన్సిలర్లు దాకి శ్యామల స్వామి, దేవుని రంజిత్, గుగులోతు రవి, కో-ఆప్షన్ సభ్యులు చింతల రాధ భవాని యాదగిరి, దేమే యాదగిరి, పట్టణ అధ్యక్షులు చింతల స్వప్న స్వామి పాల్గొన్నారు.

అలాగే కాంగ్రెస్ నాయకులు ఏమిశెట్టి అశోక్, ఎర్రం సత్యం, తొంటావాలి యాదగిరి, బొర్రా అనిల్, భైరం శంకర్, భాస్కర్, చిలుక స్వామి, పచ్చంటి రాము తదితరులు హాజరై ఒద్ది స్వామికి శుభాకాంక్షలు తెలిపారు.