భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామాయంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీలో కీలక నియామకం జరిగింది. మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు ఆదేశాల మేరకు కాంగ్రెస్ ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షుడిగా ఒద్ది స్వామి ఏకగ్రీవంగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ గజవాడ లావణ్య నాగరాజు ఆయనకు నియామక పత్రాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి, బలోపేతానికి కృషి చేయాలని ఈ సందర్భంగా పలువురు నాయకులు ఆకాంక్షించారు. ఎస్సీ సెల్ పట్టణ…






