భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

16, నవంబర్ 2026, సోమవారంభారత్ సమాచార్

సిద్దిపేట సభకు కాంగ్రెస్ శ్రేణులు కదలిరావాలి

19న చలో సిద్దిపేట సభకు కాంగ్రెస్ శ్రేణులు తరలిరావాలి.. వి.వి. రమణ పిలుపు

భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: ఈ నెల 19న సిద్దిపేటలో నిర్వహించనున్న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సభకు హుస్నాబాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, పార్టీ అభిమానులు అధిక సంఖ్యలో తరలిరావాలని పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వి.వి. రమణ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం పాల్గొనే ఈ సభలో పలు సంక్షేమ పథకాలను ప్రారంభించడంతోపాటు లబ్ధిదారులకు ప్రయోజనాలు అందించనున్నట్లు తెలిపారు.

ప్రతి కుటుంబానికి వర్తించేలా రూపొందించిన ఇందిరమ్మ బీమా యోజన పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నట్లు రమణ వెల్లడించారు. దీంతోపాటు మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం కూడా నిర్వహించనున్నట్లు చెప్పారు.

అలాగే అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో చేయూత పింఛన్ల నగదును ముఖ్యమంత్రి జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సిద్దిపేటలో నిర్వహించే సభకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని తెలిపారు.

హుస్నాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, పార్టీ అభిమానులు సమన్వయంతో పెద్ద సంఖ్యలో సభకు తరలివచ్చి కార్యక్రమంలో పాల్గొనాలని వి.వి. రమణ కోరారు. కాంగ్రెస్ శ్రేణులంతా భాగస్వాములై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.