భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

16, నవంబర్ 2026, సోమవారంభారత్ సమాచార్

నర్సంపల్లి పెద్ద తండాలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది: మండల అధ్యక్షులు యెన్నం రాజేందర్ రెడ్డి

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి పనులు చేపడుతున్నామని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు, నార్సింగి ఉపసర్పంచ్ యెన్నం రాజేందర్ రెడ్డి తెలిపారు. నార్సింగి మండలంలోని నర్సంపల్లి పెద్ద తండాలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమంతో పాటు గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు. దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక చొరవతో నర్సంపల్లి పెద్ద తండాలో సీసీ రోడ్డు నిర్మాణానికి ₹.10 లక్షల నిధులు మంజూరయ్యాయని వెల్లడించారు. ఈ నిధులతో చేపట్టే రోడ్డు నిర్మాణం పూర్తయితే స్థానిక ప్రజలకు రాకపోకల్లో సౌకర్యం కలుగుతుందని తెలిపారు.

అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది: మండల అధ్యక్షులు యెన్నం రాజేందర్ రెడ్డి

గత BRS ప్రభుత్వ హయాంలో నార్సింగి మండలం అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యానికి గురైందని రాజేందర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెరుకు శ్రీనివాస్ రెడ్డి చొరవతో తక్కువ సమయంలోనే మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. గ్రామాల అవసరాలను గుర్తించి ప్రజలకు ఉపయోగపడే పనులకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.

ప్రజలకు అవసరమైన రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో కూడా మరిన్ని నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేపడతామని, నార్సింగి మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మోహన్ నాయక్, ST సెల్ మండల అధ్యక్షుడు శంకర్ నాయక్, పార్టీ నాయకులు బాచి స్వామి, కటికే రాజేందర్, ఆకుల నరేష్ తదితరులు పాల్గొన్నారు.