భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

16, నవంబర్ 2026, సోమవారంభారత్ సమాచార్

రామాయంపేట ప్రజావాణికి 15 ఫిర్యాదులు

ప్రజావాణి కార్యక్రమంలో 15 ఫిర్యాదులు వచ్చాయని ఎంపీడీవో షాజీల్లో దీని తెలిపారు

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి రామాయంపేటలో మొత్తం 15 ఫిర్యాదులు అందాయి. సోమవారం రామాయంపేట ఎంపీడీవో కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు.

ప్రజావాణి కార్యక్రమంలో 15 ఫిర్యాదులు వచ్చాయని ఎంపీడీవో షాజీల్లో దీని తెలిపారు

ఈ కార్యక్రమంలో వివిధ సమస్యలకు సంబంధించి ప్రజలు తమ ఫిర్యాదులను అధికారులకు అందజేశారు. వీటిలో మున్సిపాలిటీ పరిధి నుంచి ఒక ఫిర్యాదు రాగా, రెవెన్యూ శాఖకు సంబంధించిన సమస్యలపై ఆరు ఫిర్యాదులు అందాయి. ఇక ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అత్యధికంగా ఎనిమిది ఫిర్యాదులు వచ్చినట్లు ఎంపీడీవో షాజీలుద్దీన్ వెల్లడించారు.

ప్రజావాణి కార్యక్రమంలో 15 ఫిర్యాదులు వచ్చాయని ఎంపీడీవో షాజీల్లో దీని తెలిపారు

ప్రజావాణిలో అందిన ప్రతి ఫిర్యాదును పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో తెలిపారు. ఫిర్యాదులపై 15 రోజుల్లోగా పరిష్కారం చూపేందుకు ప్రయత్నిస్తామని స్పష్టం చేశారు.

ప్రజలు తమ సమస్యలను ప్రజావాణి ద్వారా అధికారుల దృష్టికి తీసుకురావాలని, అందిన ఫిర్యాదులపై సంబంధిత శాఖలు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.