భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

16, నవంబర్ 2026, సోమవారంభారత్ సమాచార్

కామ్రేడ్ రాములమ్మకు సీపీఐ నేతల ఘన నివాళి

సీపీఐ అమరజీవి రాములమ్మకు ఘన నివాళి

భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి జిల్లా: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) అమరజీవి కామ్రేడ్ ఎలగందుల రాములమ్మకు పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో రాములమ్మ చిత్రపటానికి సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు గోదా శ్రీరాములు, జిల్లా రైతు సంఘం కార్యదర్శి కొల్లూరి రాజయ్య పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా రాములమ్మను స్మరించుకుంటూ ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి గౌరవం ప్రకటించారు. అనంతరం సీపీఐ జిల్లా సమితి సభ్యులు ఎలగందుల అంజయ్య, ఎలగందుల రవీందర్‌లను నాయకులు పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సమయంలో కుటుంబానికి ధైర్యం చెప్పారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి సరిగంజి వీరస్వామి, మండల సహాయ కార్యదర్శి ఎల్లంకి మహేష్, మండల కార్యవర్గ సభ్యుడు పులిపలుపుల మల్లేశం, AIYF మండల అధ్యక్షుడు మారోజు నరసింహాచారి, మండల సహాయ కార్యదర్శి గుండెగాని నాగరాజు తదితరులు పాల్గొన్నారు.