భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

17, నవంబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్

కేఆర్‌కే తండాలో పోలీసుల మెరుపు దాడులు

అక్రమంగా తయారు చేస్తున్న సారాయి..నల్ల బెల్లం,పట్టిక స్వాధీనం కేసు నమోదు చేసిన పోలీసులు

భారత్ సమాచార్, సూర్యాపేట జిల్లా: ప్రభుత్వ నిషేధాన్ని ఉల్లంఘిస్తూ అక్రమంగా సారాయి తయారుచేసి విక్రయిస్తున్నారన్న సమాచారంతో తిరుమలగిరి పోలీసులు కేఆర్‌కే తండాలో తనిఖీలు చేపట్టారు. గ్రామంలో పలు ఇళ్లలో తనిఖీలు నిర్వహించగా అక్రమంగా నిల్వ ఉంచిన సారాయితో పాటు దాని తయారీకి ఉపయోగించే ముడిసరుకు, పానకం బయటపడింది.

అక్రమంగా తయారు చేస్తున్న సారాయి..నల్ల బెల్లం,పట్టిక స్వాధీనం కేసు నమోదు చేసిన పోలీసులు

తనిఖీల్లో భాగంగా లకావత్ శ్రీను ఇంట్లో అర లీటరు సారాయిని పోలీసులు గుర్తించారు. అలాగే లకావత్ సూర తండ్రి పంతు ఇంట్లో ఒక లీటరు సారాయితో పాటు 40 లీటర్ల పానకం లభించింది. మరోవైపు లకావత్ కిషన్ తండ్రి సక్రు ఇంట్లో తనిఖీలు నిర్వహించగా 10 కిలోల నల్లబెల్లం, 2 కిలోల పట్టికతో పాటు 15 లీటర్ల పానకం పట్టుబడ్డాయి.

అక్రమంగా తయారు చేస్తున్న సారాయి..నల్ల బెల్లం,పట్టిక స్వాధీనం కేసు నమోదు చేసిన పోలీసులు

పోలీసులు స్వాధీనం చేసుకున్న పానకాన్ని అక్కడికక్కడే ధ్వంసం చేశారు. సారాయితో పాటు నల్లబెల్లం, పట్టికను స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో అక్రమంగా సారాయి తయారీ, విక్రయాలు జరగకుండా పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

అక్రమంగా తయారు చేస్తున్న సారాయి..నల్ల బెల్లం,పట్టిక స్వాధీనం కేసు నమోదు చేసిన పోలీసులు

ఈ తనిఖీల్లో ASI నికోలస్‌తో పాటు కానిస్టేబుళ్లు మురారి, సైదులు, రవీందర్ పాల్గొన్నారు.