భారత్ సమాచార్, సూర్యాపేట జిల్లా: ప్రభుత్వ నిషేధాన్ని ఉల్లంఘిస్తూ అక్రమంగా సారాయి తయారుచేసి విక్రయిస్తున్నారన్న సమాచారంతో తిరుమలగిరి పోలీసులు కేఆర్కే తండాలో తనిఖీలు చేపట్టారు. గ్రామంలో పలు ఇళ్లలో తనిఖీలు నిర్వహించగా అక్రమంగా నిల్వ ఉంచిన సారాయితో పాటు దాని తయారీకి ఉపయోగించే ముడిసరుకు, పానకం బయటపడింది.
తనిఖీల్లో భాగంగా లకావత్ శ్రీను ఇంట్లో అర లీటరు సారాయిని పోలీసులు గుర్తించారు. అలాగే లకావత్ సూర తండ్రి పంతు ఇంట్లో ఒక లీటరు సారాయితో పాటు 40 లీటర్ల పానకం లభించింది. మరోవైపు…





