భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

17, నవంబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్

రామాయంపేటలో పెన్షన్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే రోహిత్ రావు

నూతన చేయూత మంజూరు పత్రాలు పంపిణీ
నూతన చేయూత మంజూరు పత్రాలు పంపిణీ

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం మంజూరు చేసిన కొత్త చేయూత పెన్షన్ల ఉత్తర్వులను రామాయంపేటలో పంపిణీ చేశారు. పట్టణంలోని బాలాజీ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు ఉత్తర్వుల పత్రాలను అందజేశారు.

నూతన చేయూత మంజూరు పత్రాలు పంపిణీ

ఈ సందర్భంగా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో 142 మందికి, మండల పరిధిలో 323 మందికి పెన్షన్లు మంజూరయ్యాయి. మొత్తం 465 మంది లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు ఉత్తర్వులు అందించారు. కొత్తగా పెన్షన్లు మంజూరు కావడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. తమకు ఆర్థికంగా అండగా నిలిచేలా పెన్షన్లు మంజూరు చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

నూతన చేయూత మంజూరు పత్రాలు పంపిణీ

అనంతరం దామరచెరువు గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంతో పాటు పార్టీలో చేరిక కూడా జరగడంతో కార్యక్రమంలో సందడి నెలకొంది.

నూతన చేయూత మంజూరు పత్రాలు పంపిణీ

ఈ కార్యక్రమంలో మండల MPDO షాజీలోద్దీన్, తహసీల్దార్ రజనీకుమారి, మున్సిపల్ చైర్‌పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు, వైస్ చైర్‌పర్సన్ పోచమ్మల నవనీత గణేష్, రామాయంపేట మండల సర్పంచులు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బండారి మహేందర్ రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ చింతల స్వప్న స్వామి, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.