భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

17, నవంబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్

చినకొండేపూడిలో కార్తీక ఏకాదశి వేడుకలకు ఏర్పాట్లు

చినకొండేపూడిలో 20న కార్తీక ఏకాదశి దీపారాధన మహోత్సవం
చినకొండేపూడిలో 20న కార్తీక ఏకాదశి దీపారాధన మహోత్సవం

భారత్ సమాచార్, తూర్పుగోదావరి జిల్లా: కార్తీక ఏకాదశి సందర్భంగా సీతానగరం మండలం చినకొండేపూడి గ్రామంలోని శ్రీ లక్ష్మీదేవి ఆలయంలో ఈ నెల 20వ తేదీ శుక్రవారం దీపారాధన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి మరుసటి రోజు తెల్లవారుజాము వరకు వివిధ గ్రామాలకు చెందిన భజన బృందాలతో ప్రత్యేక భక్తి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

చినకొండేపూడిలో 20న కార్తీక ఏకాదశి దీపారాధన మహోత్సవం

ఈ నెల 20వ తేదీ ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే భజన కార్యక్రమాలు రాత్రంతా కొనసాగి, మరుసటి రోజు తెల్లవారుజాము వరకు నిర్వహించనున్నారు. మొత్తం ఎనిమిది విడతలుగా భజన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. చినకొండేపూడి, రఘుదేవపురం, రాజవోలు తదితర గ్రామాలకు చెందిన భజన సమాజాలు ఈ వేడుకల్లో పాల్గొని భక్తి గీతాలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని తీసుకురానున్నాయి.

చినకొండేపూడిలో 20న కార్తీక ఏకాదశి దీపారాధన మహోత్సవం

కార్తీక మాసంలో నిర్వహించే దీపారాధన మహోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ గ్రామాల నుంచి వచ్చే భక్తులు, భజన బృందాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

చినకొండేపూడిలో 20న కార్తీక ఏకాదశి దీపారాధన మహోత్సవం

అలాగే ఈ నెల 21వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆలయం వద్ద అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నప్రసాదం అందించనున్నారు. కార్తీక ఏకాదశి దీపారాధన మహోత్సవంలో భక్తులు కుటుంబ సమేతంగా అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆలయ నిర్వాహకులు కోరారు.