భారత్ సమాచార్, తూర్పుగోదావరి జిల్లా: కార్తీక ఏకాదశి సందర్భంగా సీతానగరం మండలం చినకొండేపూడి గ్రామంలోని శ్రీ లక్ష్మీదేవి ఆలయంలో ఈ నెల 20వ తేదీ శుక్రవారం దీపారాధన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి మరుసటి రోజు తెల్లవారుజాము వరకు వివిధ గ్రామాలకు చెందిన భజన బృందాలతో ప్రత్యేక భక్తి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఈ నెల 20వ తేదీ ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే భజన కార్యక్రమాలు రాత్రంతా కొనసాగి, మరుసటి రోజు తెల్లవారుజాము వరకు నిర్వహించనున్నారు. మొత్తం…