భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం ఇనుగుర్తి మండల మహిళా అధ్యక్షురాలిగా చిన్ననాగారం గ్రామానికి చెందిన కురిమెల లావణ్య గౌడ్ ఎంపికయ్యారు. ఈ మేరకు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని లండన్ హైస్కూల్లో జరిగిన కార్యక్రమంలో సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గట్టు రామచంద్రయ్య గౌడ్ ఆమె పేరును ప్రకటించి, నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా గట్టు రామచంద్రయ్య గౌడ్ మాట్లాడుతూ.. గౌడ సామాజిక వర్గం సంక్షేమం, అభివృద్ధి కోసం కొత్తగా బాధ్యతలు చేపట్టిన లావణ్య కృషి చేయాలని సూచించారు. గౌడ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి చొరవ తీసుకోవాలని చెప్పారు. సంఘం లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు సామాజిక వర్గ అభ్యున్నతికి కృషి చేయాలని కోరారు.
సామాజిక, ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తా: లావణ్య
తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం ఇనుగుర్తి మండల నూతన మహిళా అధ్యక్షురాలు కురిమెల లావణ్య గౌడ్ తెలిపారు. గౌడ జాతి అభ్యున్నతి, సంక్షేమం, సామాజిక, ఆర్థిక అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తానని చెప్పారు. గౌడ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి తన వంతు ప్రయత్నం చేస్తానని పేర్కొన్నారు.
ముఖ్యంగా గౌడ యువతకు విద్య, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కృషి చేస్తానని లావణ్య తెలిపారు. మహిళల భాగస్వామ్యాన్ని పెంచుతూ, సంఘం కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని చెప్పారు.
తనకు ఈ బాధ్యతలు అప్పగించిన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గట్టు రామచంద్రయ్య గౌడ్, జిల్లా అధ్యక్షుడు గండి వీరేందర్ గౌడ్, ఉపాధ్యక్షుడు గండి సాయి గౌడ్, యువజన సంఘం అధ్యక్షుడు కరింగుల సాగర్ గౌడ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు గండి శారద గౌడ్లకు లావణ్య ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.