భారత్ సమాచార్, మెదక్ జిల్లా: పేద కుటుంబాల సొంతింటి కలను నిజం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రామాయంపేట మున్సిపల్ చైర్‌పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి, మెదక్ నియోజకవర్గంలో గుడిసె లేని పరిస్థితిని తీసుకురావడమే ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డులో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చైర్‌పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు మాట్లాడుతూ.. ప్రజా పాలనలో పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు చెప్పినట్లుగా నియోజకవర్గంలో ఒక్క గుడిసె కూడా లేకుండా అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందించడమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఇల్లు లేని పేద కుటుంబాలకు సొంతింటి భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేద కుటుంబాలకు సొంతింటి కల నెరవేరుతుందని, అర్హులైన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్‌తో పాటు వైస్ చైర్మన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు, కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, 1వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.